వాషింగ్టన్: అత్యంత విజయవంతంగా హైపర్సోనిక్ మిస్సైల్ సిస్టమ్‌ను అమెరికా సైన్యం పరీక్షించింది. ధ్వని వేగం కన్నా అయిదు రెట్ల అధిక వేగంతో ఆ వెపన్ దూసుకెళ్లినట్లు వైమానిక దళం పేర్కొన్నది. మూడు విఫల పరీక్షల తర్వాత ఎట్టకేలకు ప్రోటోటైప్ ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించారు. అమెరికా వైమానిక దళం దీనిపై సోమవారం ఓ ప్రకటన చేసింది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఈ పరీక్ష జరిగింది. బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ ద్వారా ఏజీఎం-183ఏ ఎయిర్ లాంచ్డ్ రాపిడ్ రెస్పాన్స్ వెపన్ సిస్టమ్‌ను పరీక్షించారు. ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి విడిపోయిన తర్వాత.. ఏఆర్ఆర్డబ్ల్యూ బూస్టర్ అనుకున్న రీతిలో అంటుకున్నట్లు అధికారులు తెలిపారు. మాక్ 20 అంటే ధ్వని వేగం కన్నా 20 రేట్లు అధిక వేగాన్ని తమ ఆయుధం అందుకోగలదని తొలుత పెంటగాన్ చెప్పినా.. ఆ టార్గెట్‌ను చేరుకోలేదని స్పష్టం అవుతోంది.