China Warns US | తైవాన్‌కు అమెరికా మిలటరీ సాయంపై చైనా సీరియస్ వార్నింగ్
US-China | తైవాన్‌కు అమెరికా నుంచి మిలటరీ సాయం అందించే బిల్లుపై చైనా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. చైనా నుంచి ఎంత తీవ్రమైన ప్రతిఘటన వస్తున్నప్పటికీ.. ఈ బిల్లు అమెరికాలో ముందుకే సాగుతోంది.
తైవాన్‌కు అమెరికా నుంచి మిలటరీ సాయం అందించే బిల్లుపై చైనా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. చైనా నుంచి ఎంత తీవ్రమైన ప్రతిఘటన వస్తున్నప్పటికీ.. ఈ బిల్లు అమెరికాలో ముందుకే సాగుతోంది. దీనిపై తాజాగా స్పందించిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్.. ‘ఈ బిల్లు అమెరికా-చైనా సంబంధాల పునాదులు కదిలించి వేస్తుంది. తైవాన్ స్ట్రెయిట్‌లో శాంతి, సుస్థిరత్వంపై తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది’ అని వార్నింగ్ ఇచ్చారు.
తైవాన్‌తో సంబంధాలను అధికారికం చేయడమే కాకుండా నాలుగేళ్ల కాలంలో అమెరికా నుంచి తైవాన్‌కు 4.5 బిలియన్ డాలర్ల మిలటరీ సాయం అందించాలని ఒక సెనేట్ కమిటీ సూచించింది. ఇక్కడితో ఆగని అమెరికా.. ఒకవేళ తైవాన్ను మిలటరీ చర్యల ద్వారా ఆక్రమించేందుకు చైనా ప్రయత్నిస్తే కఠినమైన ఆంక్షలు విధిస్తామని హెచ్చరికలు చేసింది.
ఇప్పటికే చాలా కాలంగా తైవాన్‌కు అమెరికా ఆయుధాలను అమ్మడంపై చైనా అభ్యంతరాలు చెప్తూనే ఉంది. ఇప్పుడే ఏకంగా భారీ మొత్తంలో మిలటరీ సాయం అందించాలని నిర్ణయించడంపై చైనా కన్నెర్ర చేస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Taiwan
- Telugu News
- US-China
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

