US vs Iran : ఇరాన్ (Iran) పై అమెరికా (USA) వరుస దాడులు కొనసాగుతున్నాయి. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా అమెరికా ప్రతిదాడులు చేస్తున్నది. దాంతో పశ్చిమాసియా (West Asia) లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇటీవల వరుసగా మూడు రాత్రులు ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. గతరాత్రి విరామం ఇచ్చింది. ఇంతలో బుధవారం సాయంత్రం మరోసారి మిస్సైళ్లతో విరుచకుపడింది.
ఇరాన్ తీర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై భీకర దాడులు చేసింది. కాగా ఇరాన్‌పై అమెరికా దాడులను యూఎస్ కమాండ్ కంట్రోల్ అధికారికంగా ధృవీకరించింది. కాగా పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్, అమెరికా పరస్పరం దాడులకు తెగబడుతుండటంతో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇరాన్‌తోపాటు గల్ఫ్ దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి.