US-Iran Talks : యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. పాకిస్థాన్ వేదికగా ఇరాన్(Iran), అమెరికా(USA) మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరుదేశాలు కొన్ని షరతుల (అమెరికా -15, ఇరాన్ – 10)కు పట్టుపట్టిన కారణంగా అనుకున్న సమయం కంటే ఐదు గంటలు ఆలస్యంగా ఇస్లామాబాద్‌లో దౌత్యపరమైన చర్చలు మొదలయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటించారు.
పశ్చిమాసియాలో యుద్ధానికి రెండు వారాలు విరామం ప్రకటించిన ఇరాన్, అమెరికా శాంతి చర్చలు జరుపుతున్నాయి. ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరుదేశాల ప్రతినిధులు దౌత్యపరమైన చర్చల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇరుదేశాల ప్రతినిధులు శనివారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ చేరుకున్నప్పటికీ ఐదు గంటలు ఆసల్యంగా మొదలయ్యాయి. ఇరాన్‌తో అధికారికంగా చర్చలు మొదలయ్యాయి అని అమెరికా వార్తా సంస్థ న్యూస్ నేషన్.కామ్(newsnation.com)తో డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
BREAKING 🚨
🇺🇸 🇮🇷 🇵🇰 Pakistan PM Shehbaz Sharif meets the Iranian delegation in Islamabad ahead of the Islamabad talks with the US.
💥⚡️ High stakes US Iran negotiations are set to begin shortly. pic.twitter.com/ZcBpgd4M5i
— FalconUpdatesHQ (@FalconUpdatesHQ) April 11, 2026
‘ఇరాన్, అమెరికా మధ్య చర్చలు ఎలా జరుగుతాయో నాకు తెలియదు. అయితే.. ఇరాన్ విశ్వసనీయతను నేను తక్కువ సమయంలోనే గ్రహించగలను. హర్మూజ్ జలసంధి త్వరలోనే తెరుచుకోనుంది. అంతేకాదు చమురు రవాణా కోసం ప్రత్యామ్నాయ మార్గాల అవసరం ఉంది. ఇరాన్ ఒక విఫల దేశం. ఒకవేళ దౌత్యపరమైన చర్చలు విఫలమైతే యుద్ధాన్ని కొనసాగించేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. ఈసారి మరింత తీవ్రంగా దాడులకు తెగబడుతాం’ అని ఒక ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు.
🚨 US–IRAN NEGOTIATIONS LIVE
Iranian and US delegations now in Islamabad, Pakistan ahead of high-stakes talks
LATEST: US says it has NOT agreed to release frozen Iranian assets
VP JD Vance meeting Pakistan PM Shehbaz Sharif
All updates in this thread pic.twitter.com/nZWDPoC3hX
— Rapid Report (@RapidReport2025) April 11, 2026
అమెరికా ప్రతినిధులుగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ అల్లుడు జరెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ .. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘలిబఫ్, విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అర్గచీలు చర్చల్లో పాల్గొంటున్నారు. పాక్ ప్రధాని, సైనిక అధ్యక్షుడు అసిఫ్ మునిర్ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ భేటీలో ఏం నిర్ణయం తీసుకుంటారు? అనేది ఉత్కంఠ రేపుతోంది. తాత్కాలిక రెండు వారాల కాల్పుల విరమణ కొనసాగుతుందా? యుద్ధానికి ముగింపు పలుకుతారా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.