వాషింగ్టన్ : అల్జీమర్స్ వ్యాధిని ముందుగానే గుర్తించే రక్తపరీక్ష ఈ ఏడాది జూన్ నుంచి అమెరికాలో అందుబాటులోకి రాబోతున్నది. జపాన్ కంపెనీ అభివృద్ధి చేసిన సరికొత్త మెడికల్ టెస్ట్‌కు అమెరికాలోని ఎఫ్‌డీఏ గతవారమే ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధికి సంబంధించి మొట్టమొదటి రక్తపరీక్ష అమెరికాలో ఈ ఏడాది జూన్‌లో అందుబాటులోకి వస్తున్నది.
అమెరికాలోని 50 వైద్య పరిశోధన కేంద్రాలు, దవాఖానల్లో ఈ బ్లడ్ టెస్ట్ అందుబాటులో ఉంటుందని దీనిని అభివృద్ధి చేసిన ‘ఫుజిరిబియో డయాగ్నిస్టిక్స్’ హెడ్ గోకీ ఇషికావా చెప్పారు. కనీసం 55 ఏండ్లు దాటిన వ్యక్తులు, వ్యాధి లక్షణాలు ఉన్నవారు రక్త పరీక్షకు రావాలని ఆయన పేర్కొన్నారు. 30 నిమిషాల్లో ఫలితాన్ని తెలియజేస్తారు.