Israel Iran War | యుద్ధంలోకి అమెరికా.. ఇరాన్ అణుస్థావరాలపై దాడులు
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోకి (Israel Iran War) అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్‌పై బీ-2 స్పిరిట్ బాంబులతో విరుచుకుపడింది. దేశంలోని మూడు అణు స్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది.
టెహ్రాన్: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోకి (Israel Iran War) అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్‌పై బీ-2 స్పిరిట్ బాంబులతో విరుచుకుపడింది. దేశంలోని మూడు అణు స్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై మేము విజయవంతంగా దాడులు చేశాం. వాటిలో ఫార్దో, నంతాజ్, ఇస్ఫహాన్ కూడా ఉన్నాయి. ఫోర్డో పై భారీ బాంబులు ఫార్డోపై వేశాం. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశాం. విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయి. అమెరికా సైనికులకు అభినందనలు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యంకాదు. ఇప్పుడు శాంతికి సమయం’ అని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో పోస్టు చేశారు. అదేవిధంగా ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో నాశనమైందని పేర్కొన్నారు. ఇరాన్ శాంతిని నెలకొల్పాలని, తదుపరి చర్యలు నిలిపివేయాలని కోరారు. టెహ్రాన్ ప్రతి దాడులకు దిగేతే తాము తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. కాగా, ఇరాన్‌పై దాడుల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఆయన మాట్లాడారు. అయితే ఫోర్డో అణు స్థావరంపై దాడులకు ఆరు బంకర్ బస్టర్ల బాంబులను, 30 టొమాహాక్ క్షిపణులను అమెరికా ఉపయోగించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
అమెరికా దాడులను ఇరాన్ కూడా ధ్రువీకరించింది. ఫోర్డో అణు స్థావరం లక్ష్యంగా తమ శత్రువులు వైమానిక దాడులకు పాల్పడినట్లు అధికారులు టాస్మిన్ న్యూస్ ఏజెన్సీకి వెల్లడించారు. నంతాజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై కూడా దాడులు జరిగినట్లు తెలిపారు. కాగా, ఇరాన్‌పై అమెరికా దాడులతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. తమపై టెహ్రాన్ ప్రతిదాడులకు పాల్పడవచ్చనే అంచనాతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు, కార్యాలయాలను మూసివేసింది. అత్యవసర సేవలు మాత్రమే కొనసాగడానికి అనుమతించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

