వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధం మరింత తీవ్రతరం చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు డొనాల్డ్ ట్రంప్ సూచించారట! యూరప్‌లో అమెరికా సైనిక ఉనికి గణనీయంగా ఉందన్న సంగతి పుతిన్‌కు గుర్తుచేశారట. ట్రంప్-పుతిన్ మధ్య ఫోన్ సంభాషణలు జరిగినట్టు అంతర్జాతీయ మీడియాలో సోమవారం వార్తా కథనాలు వెలువడ్డాయి.
ఉక్రెయిన్ యుద్ధం సహా పలు విషయాలు ఇరువురు మధ్య ప్రస్తావనకు వచ్చినట్టు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎలా పలకాలన్నది వారిద్దరు మాట్లాడుకున్నారని ‘వాషింగ్టన్ పోస్ట్’ తెలిపింది. కాగా, వీటిని క్రెమ్లిన్ (పుతిన్ అధికార కార్యాలయం) వర్గాలు ఖండించాయి.