Religious freedom | మతపరమైన స్వేచ్ఛకు భంగం కలిగించడాన్ని సహించమని అమెరికా స్పష్టం చేసింది. మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న 11 దేశాల జాబితాను అమెరికా విడుదల చేసింది. ఈ జాబితాలో రష్యా కూడా ఉండటం విశేషం. రష్యాతోపాటు పాకిస్తాన్, చైనా కూడా ఉన్నాయి. ఈ దేశాలను ప్రత్యేక శ్రద్ధ కలిగిన దేశాల జాబితాలో చేర్చారు.
యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకారం, చైనా, క్యూబా, ఎరిత్రియా, ఇరాన్, నికరాగ్వా, ఉత్తర కొరియా, పాకిస్తాన్, రష్యా, సౌదీ అరేబియా, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్లలో మత స్వేచ్ఛ లభించకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ దేశాలు మతం ఆధారంగా వివక్షను, అణచివేతను ఆపలేకపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మతం ఆధారంగా అణచివేతను అంతం చేయడానికి అమెరికా కృషి చేస్తూనే ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ చెప్పారు. ఫండమెంటలిస్ట్ అభిప్రాయాల వల్ల కలిగే హింసను ఆపడానికి యునైటెడ్ స్టేట్స్ సాధ్యమైనంత సాయం చేస్తామని తెలిపారు.
‘ప్రపంచంలో ఎక్కడైనా ఏ వ్యక్తి అయినా తన మతం ప్రకారం జీవించే హక్కును పొందడంలో సహాయకారిగా ఉంటాం. అమెరికా దృష్టిలో కొన్ని ఇస్లామిక్ ఛాందసవాద సంస్థలు ఉన్నాయి. అలాంటి 10 సంస్థలు ఆందోళన కలిగించే జాబితాలో చేరాయి. వీటిలో అల్-షబాబ్, బోకో హరామ్, హయత్ తహ్రీర్ అల్-షామ్, హౌతీ, ఐసిస్-గ్రేటర్ సహారా, ఐసిస్-వెస్ట్ ఆఫ్రికా, జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమీన్, తాలిబాన్, వాగ్నర్ గ్రూప్ ఉన్నాయి’ అని ఆంథోని బ్లింకెన్ వెల్లడించారు.