Black Woman: హెల్ప్ కోసం 911కు కాల్ చేసిన మహిళ.. ఆమెను షూట్ చేసిన అమెరికా పోలీసులు
Black Woman: అమెరికాలో 911కు ఫోన్ చేసి.. పోలీసుల సాయం కోరింది ఓ నల్లజాతి మహిళ. ఇంటికి వెళ్లిన పోలీసులు అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆమెనే షూట్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.
లాస్ ఏంజిల్స్ : అమెరికాకు చెందిన నల్ల జాతి మహిళ(Black Woman).. గృహ హింస గురించి ఫిర్యాదు చేసేందుకు 911 ఎమర్జెన్సీ సేవలకు ఫోన్ చేసింది. అయితే ఆ ఫోన్ కాల్ ద్వారా ఆమె ఇంటికి వచ్చిన పోలీసులు.. అక్కడ జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఆ మహిళనే షూట్ చేసి చంపారు. డిసెంబర్ 4వ తేదీన లాస్ ఏంజిల్స్‌లో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి. 27 ఏళ్ల నియాని ఫిన్లేసన్ గృహ హింస గురించి 911 నెంబర్‌కు ఫోన్ చేసింది. బాయ్‌ఫ్రెండ్ వేధిస్తున్నట్లు ఆమె తన ఫోన్ కాల్లో ఫిర్యాదు చేసింది. లాంకెస్టర్లోని ఈస్ట్ ఎవన్యూలో ఉన్న అపార్ట్‌మెంట్‌కు పోలీసులు వెళ్లారు. ఆ ఇంట్లో ఉన్న వారు అరుస్తున్నట్లు గుర్తించారు.
డోర్ ఓపెన్ చేసిన పోలీసులకు .. నల్లజాతికి చెందిన నియాని తన చేతిలో ఓ భారీ కిచెన్ కత్తిని పట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. 9 ఏళ్ల కుమార్తెను తొసివేసినందుకు భాయ్‌ఫ్రెండ్‌ను పొడిచేస్తా అని ఆ మహిళ బెదిరించింది. ఆ సమయంలో జరిగిన ఘర్షణలో.. పోలీసులు కాల్పులు జరిపారు. కుమార్తె ముందే ఆ మహిళను పోలీసులు షూట్ చేశారు. హాస్పిటల్‌కు తీసుకువెళ్లినా ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

