ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక నోటిఫికేషన్లు జారీచేయడమే తరువాయి అన్నట్టు ప్రభుత్వం లీకులిస్తున్నది. అయితే ప్రస్తుతం భర్తీచేసేవి కేవలం 429 మాత్రమేనట. ఈ 12 యూనివర్సిటీల్లో దాదాపు 1,601 పైచిలుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక నోటిఫికేషన్లు జారీచేయడమే తరువాయి అన్నట్టు ప్రభుత్వం లీకులిస్తున్నది. అయితే ప్రస్తుతం భర్తీచేసేవి కేవలం 429 మాత్రమేనట. ఈ 12 యూనివర్సిటీల్లో దాదాపు 1,601 పైచిలుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 429 పోస్టుల భర్తీకే మొగ్గుచూపుతున్నది. అంటే కేవలం 25 శాతం పోస్టులను మాత్రమే భర్తీచేయనున్నది. యూనివర్సిటీలను స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ స్థాయిలో తీద్చిదిద్దుతామని చెప్తున్న సర్కార్ రెండున్నరేండ్ల కాలంలో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు.
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 2,125 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిటైర్మెంట్స్ పెరుగుతుండటంతో సర్కార్ ఆచార్యుల పదవీ విరమణ వయస్సును 60-65 ఏండ్లకు పెంచింది. పలు విభాగాలు ఒక్కరంటే ఒక్క ఆచార్యుడు లేకుండా నడుస్తున్నాయి. ఈ తరుణంలో తక్కువ పోస్టులను భర్తీచేస్తే యూనివర్సిటీలు అంతర్జాతీయస్థాయికి ఎలా చేరుతాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవలే మన పక్క రాష్ట్రం ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,523 పోస్టుల భర్తీకి కొంతకాలం క్రితమే ప్రకటన జారీచేసింది. 1,020 అసిస్టెంట్ ప్రొఫెసర్, 104 ఆర్జీయూకేటీ లెక్చరర్ పోస్టులున్నాయి. మరో 279 బ్యాక్ల్యాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం పూర్తిస్థాయిలో ఖాళీలను భర్తీ చేయడంపై దృష్టి పెట్టడం లేదు.
ఉన్నవాళ్లు 26 శాతమే..
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 74 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓయూతో పాటు 11 వర్సిటీల్లో 2,878 పోస్టులుంటే (ప్రొఫెసర్, అసొసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్) ప్రస్తుతం కేవలం 753 మంది మాత్రమే రెగ్యులర్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. అంటే ప్రస్తుతం పనిచేస్తున్నది 26 శాతమే. ఉస్మానియాలో 1,267 పోస్టులుంటే పనిచేస్తున్నది కేవలం 331 మంది మాత్రమే. పాలమూరు, బాసర ఆర్జీయూకేటీలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నది. ఈ రెండు వర్సిటీల్లో ఏకంగా 86 శాతం టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉస్మానియాలో 12 -13 విభాగాల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ప్రొఫెసర్లు లేరు. కాకతీయ విశ్వవిద్యాలయం కూడా ఇదే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ఈ వర్సిటీలో ఏకంగా 10 విభాగాలకు ప్రొఫెసర్లు లేరు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

