దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
రాష్ట్రంలోని ముస్లిం దూదేకుల కుటుంబాల సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించే లక్ష్యంతో ప్రత్యేక సర్వేను చేపడుతున్నామని తెలంగాణ ముస్లిం దూదేకుల బీసీ సంక్షేమ సంఘాల జేఏసీ చైర్మన్ మహ్మద్ రఫీ, వైస్ చైర్మన్ మహ్మద్ రాజమ్మద్ పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ముస్లిం దూదేకుల కుటుంబాల సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించే లక్ష్యంతో ప్రత్యేక సర్వేను చేపడుతున్నామని తెలంగాణ ముస్లిం దూదేకుల బీసీ సంక్షేమ సంఘాల జేఏసీ చైర్మన్ మహ్మద్ రఫీ, వైస్ చైర్మన్ మహ్మద్ రాజమ్మద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. Tgdudekulajac.org/survey వెబ్సైట్లో సర్వేఫామ్ అందుబాటులో ఉన్నదని తెలిపారు.
ముస్లిం దూదేకుల సామాజిక వర్గానికి చెందిన వారంతా సర్వేలో పాల్గొని, ఫామ్లో అడిగిన వివరాలను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముస్లిం దూదేకుల వర్గానికి సంబంధించిన సమస్యలపై భవిష్యత్తులో సమర్థంగా పనిచేయడానికి వివరాలు ఉపయోగపడతాయని తెలిపారు. సర్వేను విజయవంతం చేసేందుకు జేఏసీ నాయకులు, సంఘ ప్రతినిధులు, యువత ముందుకు రావాలని ఆ ప్రకటనలో కోరారు.
కల్యాణలక్ష్మికి నిధులు విడుదల చేయాలి
- బీఆర్ఎస్ మైనార్టీ సెల్ నేత ముకీత్చందా
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తేతెలంగాణ): కల్యాణలక్ష్మి, షాదీముబారక్కు సంబంధించి పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ముకీత్చందా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏడాదికాలంగా సుమారు రెండు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. నిధులు విడుదల కాకపోవడంతో ఆడపిల్లల పెండిండ్లు చేసిన నిరుపేద తల్లిదండ్రులు అప్పులభారంతో సతమతమవుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలులో నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

