US Strikes: వరల్డ్‌కప్ ఫైనల్, ప్రజెంటేషన్ ముగిసిన తర్వాతే ఇరాన్‌పై 9వ రోజు దాడి
US Strikes: ఇరాన్‌పై 9వ రోజు రాత్రి కూడా అమెరికా అటాక్ చేసింది. సెంట్కామ్ ఆ దాడి గురించి అప్డేట్ చేసింది. కానీ 9వ రోజు రాత్రి కాస్త ఆలస్యంగా అటాక్ ప్రారంభమైంది. అమెరికాలో జరిగిన ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ఫైనల్, అవార్డ్ ప్రజెంటేషన్ సెర్మనీ ముగిసిన తర్వాత దాడులు జరిగాయి.
వాషింగ్టన్: ఇరాన్‌పై 9వ రోజు రాత్రి కూడా అమెరికా అటాక్(US Strikes) చేసింది. సెంట్కామ్ ఆ దాడి గురించి అప్డేట్ చేసింది. అయితే ఎప్పటి మాదిరిగా కాకుండా 9వ రోజు రాత్రి కాస్త ఆలస్యంగా అటాక్ ప్రారంభమైంది. న్యూయార్క్‌లో ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌తో పాటు ప్రజెంటేషన్ సెర్మనీ ముగిసిన తర్వాత అమెరికా వైమానిక దళాలు ఇరాన్‌పై అటాక్ చేసినట్లు తెలుస్తోంది. బాంబు దాడుల అంశంలో అమెరికా అనూహ్యమైన ప్రణాళిక రచించినట్లు స్పష్టమవుతోంది. ఈస్ట్రన్ టైం ప్రకారం రాత్రి 7 గంటలకు దాడులు ప్రారంభించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అయితే గత వారం రోజుల నుంచి మాత్రం 2 పీఎం నుంచి 4 పీఎం వరకు దాడులు జరిగేవి. ఇక సూర్యోదయం కాగానే అమెరికా తన దాడుల్ని నిలిపివేసింది.
కేవలం మూడు గంటలు మాత్రమే నైట్ ఆపరేషన్ జరిగింది. అయితే ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ వల్లే ఇరాన్‌పై దాడి ఆలస్యంగా ప్రారంభమైనట్లు సెంట్కామ్ వెల్లడించలేదు. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఈ మ్యాచ్ ఎక్స్ట్రా టైం వరకు వెళ్లింది. మ్యాచ్ తర్వాత టైటిల్ ప్రజెంటేషన్ సమయంలోనూ ట్రంప్ పాల్గొన్నారు. అయితే అమెరికా వరల్డ్‌కప్ మ్యాచ్, ప్రజెంటేషన్ ముగిసిన తర్వాతే సెంట్రల్ కమాండ్ దాడులు చేసినట్లు తెలుస్తంది. ఇక ఇరాన్ దాడి వల్ల జోర్డాన్, ఇరాక్ స్థావరాల్లో ముగ్గురు అమెరికా సైనికులు మృతిచెందారు.
CENTCOM began conducting a new wave of strikes against Iran at 7 p.m. ET today for the ninth consecutive night. The strikes will continue degrading Iranian military capabilities used to attack commercial vessels and civilian mariners transiting the Strait of Hormuz.
— U.S. Central Command (@CENTCOM) July 19, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

