US-India | ఇండియాకంటే కావాల్సిన దేశం ఇంకోటి లేదు.. వచ్చే ఏడాది ఇండియాకు ట్రంప్.. అమెరికా ప్రకటన
US-India : ఇటీవల ఇండియాపై వరుస ఆంక్షలు విధిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్న అగ్రదేశం అమెరికా తాజాగా సానుకూల ప్రకటన చేసింది. అమెరికాకు ఇండియాకన్నా ఆవశ్యకమైన దేశం మరోటి లేదంటూ ప్రకటించింది.
US-India : ఇటీవల ఇండియాపై వరుస ఆంక్షలు విధిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్న అగ్రదేశం అమెరికా తాజాగా సానుకూల ప్రకటన చేసింది. అమెరికాకు ఇండియాకన్నా ఆవశ్యకమైన దేశం మరోటి లేదంటూ ప్రకటించింది. ఈ మేరకు ఇండియాలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ప్రకటన చేశారు. ఆయన ఇండియాలో అమెరికా రాయబారిగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్)పై తదుపరి చర్యలు నేటి (మంగగళవారం) నుంచి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది ట్రంప్ ఇండియాలో పర్యటిస్తారని కూడా సెర్గియో తెలిపారు. ప్రధాని మోదీతో ట్రంప్ స్నేహం స్వచ్ఛమైందని, ఇద్దరి మధ్య ఉన్న సమస్యల్ని వారు పరిష్కరించుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ‘‘ఇండియా-అమెరికా మిత్ర దేశాలు. ఉన్నతస్థాయిలో సంబంధాలు కలిగి ఉన్నాయి. నిజమైన స్నేహితులు కొన్ని అంశాల్లో విబేధించవచ్చు. కానీ, వారి మధ్య సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఇండియా ప్రపంచంలోనే పెద్ద దేశం. ఇరు దేశాల మధ్య వాణిజ్యం చాలా అవసరం. వాణిజ్య ఒప్పందంతోపాటు, రక్షణ, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, ఎనర్జీ, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్ వంటి రంగాల్లో ఇరు దేశాల్లో్ కలిసి పని చేయాలి. ప్రపంచంలోని అనేక దేశాలు తిరిగాను. ట్రంప్ తో కలిసి పని చేశా.
మోదీతో ట్రంప్ స్నేహం ప్రత్యేకమైందని మాత్రం చెప్పగలను. ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరోస్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చా. ట్రంప్ వచ్చే ఏడాది ఇండియాలో పర్యటిస్తారు. ట్రంప్ అర్ధరాత్రి రెండింటికి ఫోన్ చేస్తారు. ఇండియాలో టైం వేరే ఉంటుంది కాబట్టి.. ఇది ఆసక్తికరంగా అనిపిస్తుంది’’ అని సెర్గియో వ్యాఖ్యానించారు. త్వరలోనే ఇండియా.. ప్యాక్స్ సిలికా అలయన్స్ లో చేరాలని భావిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

