Negative Time | టొరంటో, జనవరి 1: ‘నెగెటివ్ టైమ్’ అనేది కేవలం ఒక సైద్ధాంతిక భావన కాదని, ఇది నిజమైన అంశమేనని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకు చెందిన పరిశోధకులు గుర్తించారు. వినూత్న క్వాంటమ్ ప్రయోగం ద్వారా వారు ఈ విషయాన్ని నిరూపించారు. ఒక వస్తువులోకి కాంతి ప్రవేశించడానికి ముందే దాని నుంచి ఉద్భవిస్తున్నదని ఈ ప్రయోగం ద్వారా పరిశోధకులు ప్రదర్శించారు.
సమయ స్వభావంపై అనేక దశాబ్దాలుగా ఉన్న ఆలోచనలకు భిన్నమైన అంశాన్ని ఈ ప్రయోగం చూపించింది. ‘ఫోటాన్లు ఉత్తేజిత స్థితిలో అణువులను ప్రతికూల సమయాన్ని గడిపేలా చేయగలవని మా ప్రయోగం నిరూపించింది’ అని యూనివర్సిటీ ఆఫ్ టొరంటో పరిశోధకులు స్టీన్బెర్గ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.