రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షుడు బైడెన్‌పై మళ్లీ విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మహా పిరికి అని విరుచుకుపడ్డారు. అటు జోబైడెన్, ఇటు జెలెన్స్కీని కూర్చోబెట్టి, మధ్యవర్తిత్వం చేసే వారు లేకే… ఉక్రెయిన్‌పై రష్యా ఇంకా విరుచుకుపడుతూనే వుంటోందని పుతిన్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఇంకా ఇలాంటి వాతావరణమే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం తథ్యమని ట్రంప్ జోస్యం చెప్పారు. బైడెన్ ఇంత పిరికి అయినా.. ఇన్ని అసమర్థతలు ఉన్నా… అమెరికా సైనికుల రక్తం చిందించకుండా.. రష్యా ఉక్రెయిన్ల మధ్య పరిస్థితిని చక్కదిద్దే సమయం ఇంకా వుందని అన్నారు.
అధ్యక్షుడు బైడెన్ రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని, ఆంక్షల పరంపర కొనసాగిస్తూనే వుండాలని ట్రంప్ సూచించారు. పరిస్థితి ఇలాగే వుంటే మూడో ప్రపంచ యుద్ధం తథ్యమని, అయితే తాను మాత్రం యుద్ధానికి పూర్తి వ్యతిరేకమని ట్రంప్ తేల్చి చెప్పారు.