Ukraine | బెలారస్ నుంచి దాడి.. 20 మిసైల్స్ పంపారన్న ఉక్రెయిన్
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరులో.. బెలారస్ కూడా కలిసిందా? అంటే అవుననే అంటున్నాయి ఉక్రెయిన్ వర్గాలు. ఉక్రెయిన్‌పై రష్యా సేనలు యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి.. రష్యాకు మద్దతుగా నిలిచిన బెలారస్ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనలేదు. అయితే రష్యాకు మద్దతుగా నిలిచిన కారణంగా పశ్చిమ దేశాలు.. బెలారస్‌పై కూడా ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఇప్పుడు ఆ దేశం నుంచి భారీగా మిసైల్స్ దాడి చేశాయని ఉక్రెయిన్ ప్రకటించడం కలకలం రేపింది.
ఉక్రెయిన్ దళాలు వెనకడుగు వేస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగిందని, చెర్నిగివ్ ప్రాంతంలోని దేస్నా గ్రామాన్ని మిసైల్స్ టార్గెట్ చేశాయని ఉక్రెయిన్ ఉత్తర మిలటరీ కమాండ్ ప్రకటించింది. అయితే ఈ దాడిలో ఎవరి ప్రాణాలకు ముప్పు వాటిల్లలేదని తెలిపింది. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఇద్దరూ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో సమావేశం అవడానికి ముందే ఈ దాడి జరగడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Belarus
- Russia
- Telugu News
- Ukraine
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

