UAE Ban | పాక్‌కు భారీ షాక్ ఇచ్చిన యూఏఈ.. ఆ దేశ పౌరులకు వీసాలు బంద్..!
UAE Ban | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. పాక్ పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని నిలిపివేసింది. దాంతో పాక్ పౌరులు, యూఏఈకి వెళ్లేందుకు వీసా సమస్యలను ఎదుర్కొంటున్నారు.
UAE Ban | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. పాక్ పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని నిలిపివేసింది. దాంతో పాక్ పౌరులు, యూఏఈకి వెళ్లేందుకు వీసా సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాకిస్థాన్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు సైతం యూఏఈ వీసాలు అందక ఇబ్బందులు పడుతున్నట్లుగా యూఏఈలోని పాకిస్థాన్ రాయబారి ఫైసల్ నియాజ్ తిర్మిజీ సైతం అంగీకరించారు. తమకు యూఏఈ వీసాలు రావడం లేదని పాకిస్థాన్‌లోని సామాన్యులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో యూఏఈలోని పాకిస్థాన్ ఎంబసీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా నుంచి ఓ వీడియోను పోస్ట్ చేసింది. పాక్ రాయబారి ఫైసల్ నియాజ్ తిర్మిజీ మాట్లాడుతూ పాకిస్థానీలకు వీసాల జారీలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
వీసాలు తీసుకువాలంలో రిటర్న్ టికెట్లతో పాటు హోటల్ బుకింగ్స్, 3వేల దిర్హామ్‌లు ఉండాలి. వాస్తవానికి పాక్ పౌరులు యూఏఈకి వెళ్తూ వీసా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. నకిలీ పత్రాలతో ప్రయాణించడంతో పాటు యూఏఈలో నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఆయా అంశాల ఆధారంగా పాకిస్థాన్ పౌరులపై నిషేధం విధించాలని యూఏఈ కేబినెట్ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని పాక్ రాయబార కార్యాలయం ఇస్లామాబాద్‌కి అధికారికంగా సమాచారం ఇచ్చింది. ఇందులో పాకిస్థానీ జాతీయులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం.. దేశంలోని నిరసనలు చేయడం ఎమిరాటీ చట్టాలను ఉల్లంఘించడమేనని యూఏఈ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
యూఏఈ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ కొందరు సోషల్ మీడియా వేదికగా పాకిస్థానీలు చేసిన పెట్టిన పోస్టులు దీనికి మరింత ఆజ్యం పోశాయి. నకిలీ డిగ్రీలు, ఫేక్ గుర్తింపు కార్డులు, పాస్‌పోర్ట్‌లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇతర ప్రవాస దేశీయులతో పోలిస్తే దొంగతనాలు, మోసం, భిక్షాటన, వ్యభిచారం, మాదకద్రవ్యాల సంబంధిత నేర కార్యకలాపాల్లో పాకిస్థాన్ జాతీయుల ప్రమేయం ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. భద్రతతో పాటు యూఏఈ జీరో టాలెర్స్ విధానం ఈ సమస్యల తీవ్రతను నొక్కి చెబుతుందని.. ఆయా అంశాలపై కేబినెట్లో చర్చించి.. పాకిస్థానీ పౌరులకు వీసాలపై ఆంక్షలు విధించినట్లు యూఏఈ పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

