నిషేధిత కంటెంట్‌ను తొలగించలేదనే కారణంతో సోషల్ మీడియా వేదిక ట్విట్టర్(Twitter)కు కోర్టు షాకిచ్చింది. మొత్తం రూ.30 లక్షలు జరిమానా కట్టాలంటూ తీర్పు వెలువరించింది. రష్యాలోని ఒక కోర్టు తాజాగా ఈ తీర్పునిచ్చింది. ఈ ఏడాది మార్చిలో కూడా ట్విట్టర్‌ను ఈ విషయంలో రష్యా ప్రభుత్వం హెచ్చరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్స్‌కు సంబంధించిన పోస్టులను నియంత్రించడంలో భాగంగా ట్విట్టర్ వేగాన్ని కూడా తగ్గించింది.
అయినా ఈ నిషేధిత కంటెంట్‌ను ట్విట్టర్ తొలగించకపోవడాన్ని రష్యా కోర్టు తప్పుపట్టింది. దీనికోసం ట్విట్టర్‌కు రూ.30 లక్షల ఫైన్ విధించింది. మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వెబ్సైటు గిట్‌హబ్ (GitHub)పై కూడా నిషేధిత కంటెంట్ విషయంలో రష్యా కోర్టు కన్నెర్ర చేసింది. ఈ వెబ్సైటుకు పది లక్షల రూపాయల ఫైన్ విధించింది.