వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించటంపై ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక దేశ అభివృద్ధి, గతి, గమ్యం.. అంతా జనాభాయే నిర్ణయిస్తుందన్నారు. ‘జనన రేటు పడిపోవటం వల్ల ఆయా దేశాల్లో జనాభా రానురాను పడిపోతున్నది.
భూతాపంతో మానవ నాగరికతకు పొంచివున్న ముప్పు కన్నా ఇది చాలా పెద్దది. జనాభాయే మన దేశ అభివృద్ధి పథాన్ని నిర్ణయిస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు.జనాభాలో చైనాను భారత్ దాటిపోయిందని ఐరాస వెల్లడించిన సంగతి తెలిసిందే.