న్యూయార్క్: నకిలీ ఖాతాలతో తాత్కాలికంగా నిలిపేసిన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ మళ్లీ రాబోతున్నది. ఈ నెల 29 నుంచి బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌ను పునఃప్రారంభిస్తామని ఎలాన్ మస్క్ ప్రకటించారు. అమెరికాలోని చాలా నకిలీ ట్విట్టర్ ఖాతాలు ఎనిమిది డాలర్లు చెల్లించి బ్లూటిక్‌ను పొందాయి. దీంతో ఇబ్బంది పడిన ట్విట్టర్ ఈ సర్వీస్‌ను బ్యాన్చేసింది. ఈసారి బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌ను మెరుగ్గా తీసుకొస్తున్నట్టు మస్క్ ట్వీట్ చేశారు. కొత్త నిబంధనలప్రకారం.. ఎవరైనా వెరిఫైడ్ పేరును మారిస్తే సేవా నిబంధనలకు అనుగుణంగా పేరును ట్విట్టర్ ధ్రువీకరించేవరకు బ్లూ చెక్‌ను కోల్పోతారని ప్రకటించారు.