బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Jan 25, 2020 , 09:57:59

ట‌ర్కీలో భూకంపం.. 18 మంది మృతి

ట‌ర్కీలో భూకంపం.. 18 మంది మృతి

ట‌ర్కీలో శ‌క్తివంత‌మైన భూకంపం. సిరియా, లెబ‌నాన్‌, ఇరాన్ దేశాల్లోనూ భూప్ర‌కంప‌న‌లు. భూకంపం వ‌ల్ల 18 మంది మృతి

హైద‌రాబాద్‌: ట‌ర్కీలో శ‌క్తివంత‌మైన భూకంపం వ‌చ్చింది.  భూకంప తీవ్ర‌త 6.8గా న‌మోదు అయ్యింది.  భూకంపం వ‌ల్ల 18 మంది మృతిచెందారు. ఎల‌జిగ్ ప్రావిన్సులోని సివ్రైస్ న‌గ‌రం భూకంప కేంద్రంగా ఉన్న‌ది. భారీ భూకంపంతో అనేక బిల్డింగ్‌లు కూలాయి. జ‌నం వీధుల వెంట ప‌రుగులుతీశారు.  సిరియా, లెబ‌నాన్‌, ఇరాన్ దేశాల్లోనూ భూప్ర‌కంప‌న‌లు న‌మోదు అయ్యాయి.  1999లో ట‌ర్కీలో వ‌చ్చిన భూకంపంలో సుమారు 17వేల మంది మ‌ర‌ణించారు. శుక్ర‌వారం వ‌చ్చిన భూకంపం త‌ర్వాత సుమారు 60 సార్లు భూ ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయ్యాయి.   


logo
>>>>>>