Tonga | సముద్ర గర్భంలో సునామీ.. ప్రస్తుతం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే..

Tonga tsunami | దక్షిణ పసిఫిక్ సముద్రంలోని టోంగా దీవిపై ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఓ భారీ అగ్ని పర్వతం బద్దలు కావడంతో టోంగా దీవి అతలాకుతలం అవుతుంది. భారీ విస్ఫోటనం కారణంగా సునామీ పోటెత్తింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అగ్నిపర్వతం పేలడం వల్ల వచ్చిన బూడిద ఆకాశం మొత్తాన్ని కమ్మేసింది. ఆ బూడిద నీటిలో పడటం వల్ల తాగడానికి మంచి నీరు కూడా దొరకడం లేవు. తమ గురించి సమాచారం ఇద్దామని అనుకున్నప్పటికీ కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా అసలు టోంగాలో ఏం జరుగుతుంది? అక్కడి వారి పరిస్థితి ఎలా ఉందనే విషయం ప్రపంచానికి తెలియకుండా పోయింది.
అసలేం జరిగింది?
దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ద్వీపకల్పం టోంగాలో సమీపంలోని అగ్నిపర్వతం భారీ విస్ఫోటనం చెందింది. టోంగా రాజధానినుకోలోపాలోకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. ఈ అగ్నిపర్వతం పేలుడు 2383 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూజిలాండ్ వరకు వినిపించింది. అంటే విస్ఫోటం ఏ రేంజ్లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పేలుడు కారణంగా టోంగా తీరాన్ని సునామీ ముంచెత్తింది. దీంతో భయభ్రాంతులకు లోనైన లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ క్రమంలో భారీ ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడినట్లు తెలుస్తున్నది. అలాగే అగ్నిపర్వతం పేలుడు వల్ల వచ్చిన బూడిద నీటిలో కలిసిపోవడం వల్ల తాగునీటి సమస్య కూడా ఏర్పడిందని సమాచారం. ఇదిలా ఉంటే సునామీ కారణంగా అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో ఇంటర్నెట్, ఫోన్లు కూడా పనిచేయడం లేవు. దీంతో బయట ప్రపంచంతో చాలావరకు సంబంధాలు తెగిపోయాయి.
టోంగాలో పరిస్థితిని తెలుసుకునేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం.. ఒక ప్రత్యేక విమానాన్ని పంపించింది. టోంగా జనాభా 1.05 లక్షల మంది కాగా.. వీరిలో దాదాపు 80 వేల మంది ఈ సునామీకి ప్రభావితమై ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ సునామీ కారణంగా భారీ నష్టం సంభవించిందని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ వెల్లడించారు. దీవిలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని.. ఫోన్లు పనిచేయడం మొదలవుతుందని ఆమె తెలిపారు. కాగా, అగ్నిపర్వతం విస్ఫోటం నేపథ్యంలో అమెరికా, న్యూజిలాండ్, జపాన్ సహా పలు దక్షిణ పసిఫిక్ సముద్ర తీర దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
పురుషులు ఎక్కువకాలం ఒంటరి జీవితం గడిపితే ఏమవుతుందో తెలుసా..?
Professional Queuer | జస్ట్ లైన్లో నిలబడి రోజూ రూ.16 వేలు సంపాదిస్తున్నాడు.. అలా ఎలా సాధ్యం?
కొన్ని గంటల్లో లాటరీ తీస్తారనగా టికెట్ కొన్నాడు.. 12 కోట్లు గెలుచుకున్నాడు.. ఎక్కడో తెలుసా?
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- tonga
- Tonga Volcano
- Tsunami
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

