Professional Queuer | జస్ట్ లైన్లో నిలబడి రోజూ రూ.16 వేలు సంపాదిస్తున్నాడు.. అలా ఎలా సాధ్యం?
Professional Queuer | ఎట్టెట్టా.. లైన్లో నిలబడి రోజుకు 16 వేలు సంపాదిస్తున్నాడా? చెవిలో పువ్వులు పెడుతున్నారా? అని అనేయకండి. ఎందుకంటే.. మేము చెప్పేది నిజం. ఆ వ్యక్తి కేవలం లైన్లో నిలబడి రోజూ డబ్బులు సంపాదిస్తున్నారు. అసలు ఆయన జాబే అది. లైన్లో నిలబడటమే ఆయన జాబ్. అలా చేసి రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అలా ఎలా సాధ్యం అయింది? అంటారా.. పదండి ఓసారి లండన్ వెళ్లొద్దాం.

అతడి పేరు ఫ్రెడ్డీ బెకిట్. లండన్‌కు చెందిన బెకిట్ను అందరూ ప్రొఫెషనల్ క్యూయర్ అంటారు. ఎందుకంటే.. అతడు చేసే పనే అది. ధనవంతుల కోసం అతడు లైన్లో నిలుచుంటాడన్నమాట. క్యూ అంటే ఉదాహరణకు సినిమా హాల్ ముందు క్యూ కావచ్చు.. మాల్స్ ముందు కావచ్చు. వైన్ షాపుల ముందు, మ్యూజియం, సూపర్ మార్కెట్స్, స్టోర్స్ ముందు క్యూ కావచ్చు.. ఎక్కడ క్యూ ఉన్నా.. అక్కడ బెకిట్ ప్రత్యక్షం అవుతాడు. లైన్లో నిలబడలేని వాళ్ల కోసం లైన్లో నిలబడి డబ్బు సంపాదిస్తాడు.
గడ్డ కట్టే చలిలో, ఎండలో నిలబడలేని వాళ్ల కోసం బెకిట్ ఈ పని చేస్తాడు. అలా వాళ్ల కోసం లైన్లో నిలబడినందుకు గంటకు రూ.2000 ఇస్తారట. రోజుకు కనీసం 8 గంటలు పనిచేసినా తనకు రూ.16000 వరకు వస్తాయట.
ఎక్కువగా ఏవైనా ఈవెంట్స్ కోసం టికెట్లు తీసుకోవడానికి వచ్చేవాళ్లు తనకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి క్యూలో నిలుచోబెడతారట. అయితే.. లండన్‌లో ఇలాంటి ప్రొఫెషనర్ క్యూయర్స్ చాలామందే ఉన్నారు. ఎక్కువ లైన్ ఉన్నప్పుడు అంత పెద్ద లైన్లో నిలబడలేక చాలామంది ఇలాంటి ప్రొఫెషనర్ క్యూయర్స్ను ఉపయోగించుకుంటారు. తద్వారా వీళ్లకు కూడా పనికి పని.. ఆదాయానికి ఆదాయం. భలే ఉంది కదా ఈ జాబ్.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

