పురుషులు ఎక్కువకాలం ఒంటరి జీవితం గడిపితే ఏమవుతుందో తెలుసా..?
Alone Men: సాధారణంగా అపరిశుభ్ర పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం లాంటి కారణాలవల్ల తరచూ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇవేగాక ఒంటరితనంతో కూడా

హైదరాబాద్: సాధారణంగా అపరిశుభ్ర పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం లాంటి కారణాలవల్ల తరచూ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇవేగాక ఒంటరితనంతో కూడా మానసిక, శారీరక అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ఏండ్ల తరబడి ఒంటరిగా జీవించడం, వరుసగా సంబంధాలు తెగిపోవడం జరిగినప్పుడు అలాంటివారి రక్త కణాల్లో తేడాలు వస్తాయని, ఇది క్రమంగా రకరకాల అనారోగ్యాలకు దారితీస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
అయితే, ఈ పరిస్థితి కేవలం ఒంటరి మగవాళ్లలో మాత్రమే కనిపిస్తుందని పరిశోధకులు తెలిపారు. జర్నల్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్‌లో ఈ నూతన అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఒంటరితనంవల్ల కనిపించే ఈ ఇన్ఫ్లమేషన్ను లో గ్రేడ్ ఇన్‌ఫ్లమేషన్‌గా వర్గీకరించారు. ఇది నిరంతరం కొనసాగుతుందని, వయసు సంబంధ అనారోగ్యాలకు, మరణాలకు ఈ ఇన్ఫ్లమేషన్ దారితీస్తుందని తెలిపారు.
జీవిత భాగస్వామితో విడాకులు తీసుకోవడం లేదంటే ఆమెతో తరచూ సంబంధాలను తెంచుకుంటూ ఎక్కువకాలం ఒంటరిగా జీవించడంవల్ల బలహీనమైన శారీరక, మానసిక స్థితిలోకి వెళ్లడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, మరణాలు సంభవించడం లాంటి ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయని అధ్యయనకారులు తెలిపారు. మొత్తం 4,835 మందిపై పరిశోధన చేసి నివేదికను తయారుచేశారు. అంతా 48 ఏండ్ల నుంచి 62 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారిని పరిశోధన కోసం ఎంచుకున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

