వాషింగ్టన్: టైమ్ మ్యాగజైన్ కవర్‌పేజీపై తన ఫొటో చూసుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి ఫొటోను కవర్‌పేజీపై వేస్తారా? ఆ ఫొటోలో తలపై జట్టు కనిపించటం లేదు. ఇంతకంటే చెత్త ఫొటో మరోటి లేదు’ అంటూ ట్రంప్ విమర్శించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చటంలో కీలక పాత్ర వహించిన ట్రంప్‌పై టైమ్ మ్యాగజైన్ కథనం ప్రచురించింది. అయితే ఫొటో ట్రంప్‌కు నచ్చలేదు.