Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Donald Trump: రష్యా నుంచి 3 లక్షల టన్నుల డీజిల్ కొనుగోలు చేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. నవంబర్ 3వ తేదీన మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ అత్యవసరంగా డీజిల్‌ను ఖరీదు చేస్తున్నారు. డీజిల్ కొనడమంటే, పుతిన్‌కు గిఫ్ట్ ఇవ్వడమే అవుతుందని జెలెన్స్కీ అన్నారు.
న్యూయార్క్: ప్రపంచ దేశాలకు ట్రంప్ షాకిచ్చారు. రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మూడు లక్షల టన్నుల డీజిల్‌ను రష్యా సరఫరా చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు. నవంబర్ 3వ తేదీన మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్(Donald Trump) అత్యవసరంగా డీజిల్‌ను ఖరీదు చేస్తున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇచ్చే బహుమతి వల్ల శాంతి రాదు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. ట్రుత్ సోషల్ లో డీజిల్ ఖరీదుపై ట్రంప్ ప్రకటన చేశారు. పుతిన్‌తో చర్చలు అత్యంత విజయవంతమైనట్లు చెప్పారు.
తక్షణమే మూడు లక్షల టన్నుల డీజిల్ సరఫరా చేసేందుకు పుతిన్ అంగీకరించారని ట్రంప్ చెప్పారు. నవంబర్‌లో మరో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత 10 లక్షల టన్నులు, మళ్లీ మరో 30 లక్షల టన్నుల డీజిల్‌ను రష్యా సరఫరా చేయనున్నది. హర్మూజ్‌పై సంపూర్ణ ఆధిపత్యం, రష్యాతో ఇంధన డీల్ కుదిరిన నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు రికార్డు స్థాయిలో తగ్గిపోతాయని, చాలా వేగంగా ఆ మార్పు ఉంటుందని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో లీటరు డీజిల్ ధర 150కి చేరుకున్నది.
రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తే భారీ పన్నులు విధిస్తామని ఇండియాకు హెచ్చరిక జారీ చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ ఇంధనం కోసం రష్యా మీద ఆధారపడడం అర్థంకాని స్థితిగా మారిపోయింది. రష్యా డీజిల్‌ను దిగుమతి చేసుకునేందుకు ట్రంప్ చేసిన ప్రకటనను జెలెన్స్కీ ఖండించారు. పుతిన్‌కు ట్రంప్ గిఫ్ట్ ఇస్తున్నారని, ఎందుకంటే ఆ పెట్టుబడితో రష్యా యుద్ధం చేస్తుందని, ఇక యుద్ధానికి ముగింపు ఉండదని ఆరోపించారు. డీజిల్‌ను అమ్ముకున్న రష్యా.. మరింత భీకరంగా దాడులు చేస్తుందని జెలెన్స్కీ చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

