లండన్ : లండన్ కింగ్స్ కాలేజీకి చెందిన పరిశోధకులు మానవుల వెంట్రుకల నుండి ఒక అద్భుతమైన టూత్‌పేస్ట్‌ను అభివృద్ధి చేశారు. ఇది దెబ్బతిన్న దంతాలను రక్షించడానికి, మరమ్మతు చేయడానికి ప్రభావ వంతమైన పద్ధతిని అందిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మానవుడి వెంట్రుకల్లోని ‘కెరాటిన్’ అనే ప్రొటీన్ సహజ లక్షణాలను ఉపయోగించి..
దంతాల్ని రక్షించే ఖనిజ పొర (ఎనామెల్) తిరిగి ఏర్పడేట్టు చేయవచ్చునని వారి అధ్యయనం పేర్కొన్నది. ఎక్కువగా కనిపించిన ఆరోగ్య సమస్యల్లో ఒకటి దంత క్షయం. దీనివల్ల ఎనామెల్ కోత, నోటి పరిశుభ్రత లేకపోవటం, దంతాలు దెబ్బతినటం వంటి వాటికి దారితీస్తుంది. దీనిని సాధారణ టూత్‌పేస్ట్ నెమ్మదింపజేస్తుంది. కానీ పూర్తిగా ఆపదు. అయితే కెరాటిన్ ఆధారిత చికిత్సలు దంత క్షయాన్ని పూర్తిగా ఆపేస్తాయి.