మాస్కో, జూలై 24: రష్యాలో జరుగుతున్న చెస్ టోర్నమెంట్లో అపశృతి జరిగింది. చెస్ ఆడుతున్న రోబో 7 ఏండ్ల బాలుడి వేలు విరిచింది. తన పావును కదపడానికి ఉన్న సమ యం పూర్తికాకుండానే, బాలుడు తన పావును కదిలించే ప్రయత్నం చేయడంతో రోబో అతడి వేలును అదిమి పట్టింది. సిబ్బంది వెంటనే బాలుడు వేలును విడిపించారు. ఈ నెల 19న జరిగిన మాస్కో చెస్ ఓపెన్ టోర్నమెంట్లో ఈ ఘటన జరిగింది. అయితే, బాలుడి వేళ్లు విరిగిపోయాయని నిర్వాహకులు తెలిపారు.