Pandas | న్యూఢిల్లీ: చైనా నుంచి తీసుకొచ్చిన రెండు పాండాల నిర్వహణ ఖర్చు ఫిన్లాండ్కు తలనొప్పిగా మారింది. 2018లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఫిన్లాండ్ పర్యటన సందర్భంగా రెండు పాండాలను ఇక్కడి ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన ‘జూ’కు అప్పగించారు. 15 ఏండ్ల పాటు పాండాలను ఈ జూలో ఉంచేందుకు చైనాతో ఫిన్లాండ్ ఒప్పందం చేసుకుంది.
జూలో వాటి సంరక్షణ కోసం రూ.74 కోట్లు వెచ్చించింది. అయితే కోవిడ్ సంక్షోభం తర్వాత పర్యాటకుల తాకిడి తగ్గటంతో, జూపై ఆర్థిక భారం పెరిగింది. దీంతో పాండాల నిర్వహణ ఖర్చులు భరించలేమంటూ కంపెనీ చేతులెత్తేసింది. చైనాకు ఆ రెండు పాండాలను తిరిగి ఇచ్చేందుకు సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో పాండాలు చైనాకు చేరుకోనున్నాయి.