సియోల్: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యూల్కు సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు శుక్రవారం ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. ఆయన 2024 డిసెంబర్ 3న దేశంలో మార్షల్ లా విధిస్తున్నట్లు ప్రకటించారు. కొద్ది గంటల్లోనే పార్లమెంటు సమావేశమై, ఆయన జారీ చేసిన డిక్రీని రద్దు చేసింది. ఆ తర్వాత ఆయనను పదవీచ్యుతుడిని చేసింది. ఈ ఓటింగ్లో పాల్గొన్న వారిలో ఆయన పార్టీ కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు కూడా ఉన్నారు. దక్షిణ కొరియా అధ్యక్ష పదవిలో ఉన్నవారు అరెస్ట్ కావడం ఇదే తొలిసారి.