Thailand | థాయ్‌లాండ్ కీలక నిర్ణయం.. భారతీయులకు ఉచిత వీసా జారీ
Thailand | పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్‌లాండ్ (Thailand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, తైవాన్ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించాలని నిర్ణయించింది. నవంబర్ నుంచి వచ్చే ఏడాది (2024) మే వరకూ ఈ సడలింపులు అమల్లో ఉంటాయని థాయ్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
Thailand | పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్‌లాండ్ (Thailand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, తైవాన్ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించాలని నిర్ణయించింది. నవంబర్ నుంచి వచ్చే ఏడాది (2024) మే వరకూ ఈ సడలింపులు అమల్లో ఉంటాయని థాయ్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. భారత్ (India), తైవాన్ (Taiwan ) నుంచి వచ్చే వారు వీసా లేకుండా 30 రోజులు థాయ్‌లాండ్‌లో పర్యటించొచ్చని తెలిపారు. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కాగా, థాయ్‌లాండ్‌కు చైనా, మలేషియా, దక్షిణ కొరియా తర్వాత భారత్నుంచే ఎక్కువగా పర్యాటకులు వెళ్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని థాయ్ ప్రభుత్వం ఇటీవలే చైనా పర్యాటకులకు ఫ్రీ వీసా ఎంట్రీకి అనుమతిచ్చింది. ఇప్పుడు తాజాగా భారత్, తైవాన్‌కు ఆ వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకూ 22 మిలియన్ల మంది థాయ్‌లాండ్ సందర్శనకు వెళ్లారు. దీని ద్వారా 927.5 బిలియన్ బాట్ (25.67 బిలియన్ డాలర్లు) ఆదాయం సమకూరింది. ఇక ఈ ఏడాది 28 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే తాజా నిర్ణయం తీసుకుంది.
Also Read..
Lulu Mall | లులూ మాల్లో వ్యక్తి వికృత చేష్టలు.. మహిళలను అసభ్యకరంగా తాకుతూ
Rahul Gandhi | అదానీని కాపాడేందుకే ఫోన్ ట్యాపింగ్.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ ఫైర్
Kerala Triple Blasts | కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

