ప్రపంచంలో చాలా వేగంగా అమ్ముడుపోతున్న కార్లు టెస్లా ఎలక్ట్రిక్ కార్లు. ఎలన్ మస్క్‌ను ప్రపంచ కుబేరుడిగా మార్చిన ఈ కంపెనీకి ఒక హ్యాకర్ షాకింగ్ వార్త చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెస్లా కార్లలో కనీసం 25 కార్లను తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు కంట్రోల్ చేస్తానని చెప్పాడు.
అంతేకాదు, డ్రైవర్ ఉన్నదీ లేనిదీ చూసి, కారు స్టార్ చేయడం, హెడ్‌లైట్స్ ఆన్-ఆఫ్ చేయడం, తాళాలు లేకుండా కారు డోర్లు ఓపెన్ చేయడం వంటి పనులన్నీ చేస్తానని చెప్పాడు. అమెరికాకు చెందిన డేవిడ్ కొలంబో అనే 19 ఏళ్ల హ్యాకర్ ఈ మేరకు ట్వీట్లు చేశాడు. టెస్లా కార్లలోని సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ఒక చిన్న లోపం వల్లే తను ఈ పనులన్నీ చేయగలుగుతున్నానని కొలంబో వెల్లడించాడు.
అయితే ఆ సెక్యూరిటీ లోపం ఏంటో మాత్రం వెల్లడించలేదు. ఈ ట్వీట్లపై టెస్లా నుంచి అధికారికంగా స్పందన లేదు. కానీ టెస్లా సెక్యూరిటీ టీం తనతో టచ్‌లో ఉందని, ఈ సెక్యూరిటీ లోపంపై త్వరలోనే అప్డేట్ ఇస్తామని టెస్లా ప్రతినిధులు తనకు చెప్పారని కొలంబో తెలిపాడు. అయితే ఈ సెక్యూరిటీ లోపం ప్రథానంగా కారు యజమానులు, లేదంటే వేరే థర్డ్ పార్టీల తప్పేనని కొలంబో అభిప్రాయపడ్డాడు.
So, I now have full remote control of over 20 Tesla’s in 10 countries and there seems to be no way to find the owners and report it to them…
— David Colombo (@david_colombo_) January 10, 2022
Addition as of 11. Jan 22:33 (CET)
— David Colombo (@david_colombo_) January 11, 2022
Tesla‘s Security Team just confirmed to me they’re investigating and will get back to me with updates as soon as they have them.
[8/8]