మంగళవారం 31 మార్చి 2020
International - Mar 18, 2020 , 19:31:44

‘దయచేసి మమ్మల్ని ఇండియాకు రప్పించండి’

‘దయచేసి మమ్మల్ని ఇండియాకు రప్పించండి’

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం తెలిసిందే. కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ఫిలిప్పీన్స్‌ సైతం ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా ఇతర ప్రాంతాలవారు 72 గంటల్లో తమ దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఈ నెల 16న ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈ నెల 17, 18, 19వ తేదీల్లో భారత్‌కు తిరిగి వచ్చేందుకు అక్కడ విద్యనభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులు టికెట్లను కొనుగోలు చేశారు. కాగా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లోకి ఏ విదేశీ విమానాన్ని అనుమతించమని కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం భారత్‌కు తిరిగి వచ్చేందుకు సిద్దమైన విద్యార్థులపై పడింది. ఫిలిప్పీన్స్‌ నుంచి సింగపూర్‌ అక్కడ నుంచి ఇండియాకు వద్దామనుకుంటే కనీసం తమకు బోర్డింగ్‌ పాసును కూడా అందజేయడం లేదని వాపోయారు. మనీలా నుంచి సింగపూర్‌ వరకూ ప్రయాణించడానికి అక్కడి విమానాశ్రయం అధికారులు అనుమతించడం లేదని విచారం వ్యక్తం చేశారు. తమను ఎలాగైనా ఫిలిప్పీన్స్‌ నుంచి ఇండియాకు రప్పించాలని బాధిత విద్యార్థులు నమస్తే తెలంగాణను ఆశ్రయించారు.logo
>>>>>>