బడి ఎగ్గొట్టేందుకు ఫేక్ కొవిడ్ రిపోర్ట్లు తయారు చేస్తున్న విద్యార్థులు.. ఎలానో తెలిస్తే షాక్ కావాల్సిందే

లండన్: స్కూల్ ఎగ్గొట్టడానికి పిల్లలు రకరకాల కారణాలు చెప్పడం కామనే. ఇప్పుడు వాళ్లకు మరో బహానా దొరికింది. దానిపేరే కొవిడ్. ఏడాది కాలంగా కరోనా పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది కాదా. అందుకే ఆ మహమ్మారినే ఉపయోగించి స్కూళ్లను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్టూడెంట్స్. అంతేకాదు తమ ఫ్రెండ్స్‌కు కూడా టిక్‌టాక్ ద్వారా నకిలీ కొవిడ్ పాజిటివ్ రిపోర్ట్ ఎలా పొందాలో కూడా చెబుతున్నారు. ఈ సంస్కృతి పెరిగిపోతుండటంతో ఇప్పుడక్కడి విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నకిలీ రిపోర్ట్.. ఎలా?
యూకేకు చెందిన ఐన్యూస్ అనే వెబ్సైట్ దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పబ్లిష్ చేసింది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్స్ తెలుసు కదా. ఈ కిట్‌పై నిమ్మరసంతోపాటు ఇతర రకరకాల ద్రవాలను వేసి కొవిడ్ పాజిటివ్ రిపోర్ట్ సంపాదించడంలో స్టూడెంట్స్ ఆరితేరిపోయారట. అంతేకాదు తాము ఎలా పాజిటివ్ రిపోర్ట్ పొందామో చెబుతూ టిక్‌టాక్‌లో వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తుండటం విశేషం.
#fakecovidtest హ్యాష్‌ట్యాగ్‌తో ఈ వీడియోలను పోస్ట్ చేస్తున్నట్లు ఐన్యూస్ తెలిపింది. వీటికి ఇప్పటికే 65 లక్షల వరకూ వ్యూస్ వచ్చినట్లు చెప్పింది. ఇదే పేరుతో టిక్‌టాక్‌లో ప్రత్యేకంగా ఓ అకౌంట్ ఉండగా.. దానికి 20 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.
ఎలా చేస్తున్నారు?
ఈ వీడియోల్లో చాలా మంది యూజర్లు లెమన్ జ్యూస్, ఆపిల్ సాస్, కోకా కోలా, వెనిగర్, హ్యాండ్ శానిటైజర్‌లాంటి ద్రవాల వివిధ కాంబినేషన్లను యాంటిజెన్ టెస్ట్ కిట్లపై వేసి పాజిటివ్ రిజల్ట్స్ సాధిస్తుండటం గమనార్హం. ఈ రిపోర్ట్‌నే చూపిస్తూ.. స్కూలుకు బంక్ కొడుతున్నారు. ఇలా చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి చాలా మంది విద్యార్థులు నిజంగానే కొవిడ్ బారిన పడుతున్నారని, అయితే కొందరు మాత్రం ఇలా ఫేక్ రిపోర్టులు సృష్టిస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ స్కూల్ అండ్ కాలేజీ లీడర్స్ ప్రధాన కార్యదర్శి జెఫ్ బార్టన్ తెలిపారు. పిల్లలు ఇలాంటి పనులు చేయకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని కోరారు.
ఇది సాధ్యమేనా?
ఇలాంటి ద్రవాలను వేస్తే నిజంగానే పాజిటివ్ రిపోర్ట్ వస్తుందా? ఇదే అంశంపై ఫుల్ ఫ్యాక్ట్ అనే ఓ నిజనిర్ధారణ సంస్థ ప్రయోగాలు చేసింది. ఫిజ్జీ డ్రింక్స్, సిట్రస్ పండ్ల వంటివి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్కిట్పై పాజిటివ్ ఫలితాన్ని చూపిస్తున్నట్లు తేలడం విశేషం. అయితే కొవిడ్‌పై ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్న వీడియోలను తొలగిస్తామని టిక్‌టాక్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

