Gaza Strip: ఉత్తర గాజాలోకి ఎంటరైన ఇజ్రాయిలీ యుద్ధ ట్యాంకులు.. వీడియో
Gaza Strip: రాత్రికి రాత్రి గాజాలోకి ఐడీఎఫ్ యుద్ధ ట్యాంకులు వెళ్లి వచ్చాయి. రాత్రి పూట జరిగిన రెయిడ్‌లో కొన్ని టార్గెట్లను ధ్వంసం చేశారు. హమాస్ స్థావరాలను పేల్చివేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళం పేర్కొన్నది. దానికి సంబంధించిన వీడియోలను రిలీజ్ చేశారు.
జెరుసలేం: ఇజ్రాయిల్ గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. గాజా స్ట్రిప్(Gaza Strip) వద్ద ఉన్న ఉత్తర ప్రాంతంలోకి తమ యుద్ధ ట్యాంకులు వెళ్లినట్లు ఇస్రాయిల్ రక్షణ దళాలు ఇవాళ పేర్కొన్నాయి. కొన్ని టార్గెట్ చేసిన ప్రదేశాల్లోకి రాత్రి పూట ఆ ట్యాంకులు వెళ్లినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. తమ ఆపరేషన్‌లో భాగంగా.. అనేక మంది ఉగ్రవాదులను, హమాస్ మౌళిక సదుపాయాల్ని, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ లాంచింగ్ ప్రదేశాల్ని టార్గెట్ చేసినట్లు ఐడీఎప్ పేర్కొన్నది. హమాస్ ఉగ్రవాదులతో పోరుకు దిగిన ఇజ్రాయిల్ బోర్డర్ వద్ద యుద్ధ ట్యాంకులతో రెయిడ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి స్థాయిలో అక్కడ గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టనున్నట్లు తెలిపింది. రెయిడ్ చేసిన తర్వాత మళ్లీ యుద్ధ ట్యాంకులు ఆ ప్రదేశాన్ని వీడినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది.
כוחות צה”ל בפיקוד חטיבת גבעתי ביצעו הלילה פשיטה ממוקדת באמצעות טנקים בשטח צפון רצועת עזה, כחלק מהכנת המרחב לשלבי הלחימה הבאים.
במסגרת הפעילות הכוחות איתרו ותקפו מחבלים רבים, השמידו תשתיות טרור, עמדות נ”ט וביצעו עבודות לארגון המרחב.
הכוחות יצאו מהמרחב בסיום המשימה pic.twitter.com/pWKfMV6Fz0— צבא ההגנה לישראל (@idfonline) October 26, 2023
గాజా, లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న ప్రజల్ని తరలించేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం పొడిగించినట్లు తెలుస్తోంది. హమాస్‌తో జరుగుతున్న యుద్ధం వల్ల సుమారు రెండు లక్షల మంది ఇజ్రాయిలీలు తమ స్వస్థలాల్ని కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు. రాఫా వద్ద ఉన్న బోర్డర్ క్రాసింగ్‌ను ఓపెన్ చేయాలని ఇజ్రాయిల్, వెస్ట్‌బ్యాంక్, ముస్లిం దేశాల్లో నిరసనలు చేపట్టాలని హమాస్ ఉగ్రవాదులు పిలుపు ఇచ్చారు. వైద్య పరికరాలతో కూడిన సుమారు 8 ట్రక్కులను గాజాకు తీసుకువచ్చేందుకు రెడ్‌క్రాస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- gaza raids
- Gaza strip
- Hamas
- IDF
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

