మాస్కో, జూలై 22: ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాలు 90 శాతం తాలిబన్ల ఆధీనంలోకి వచ్చినట్టు వారి ప్రతినిధి రష్యా మీడియా సంస్థ ఆర్ఐఏ నొవొస్తీకి తెలిపారు. ఆఫ్ఘన్‌కు తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్, ఇరాన్‌తో సరిహద్దులు ఉన్నాయి. ఆఫ్ఘన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెనుతిరగడంతో తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు.