Afghanistan | ప్రభుత్వ ఏర్పాటు.. పాకిస్థాన్, చైనా, రష్యాలను ఆహ్వానించిన తాలిబన్లు
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు తాలిబన్లు. సోమవారం చివరి పంజ్‌షిర్ ప్రావిన్స్‌ను కూడా చేజిక్కించుకున్నామని ప్రకటించుకున్న తాలిబన్లు.. ఇక ప్రభుత్వానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు తాలిబన్లు. సోమవారం చివరి పంజ్‌షిర్ ప్రావిన్స్‌ను కూడా చేజిక్కించుకున్నామని ప్రకటించుకున్న తాలిబన్లు.. ఇక ప్రభుత్వానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి పాకిస్థాన్‌తోపాటు చైనా, రష్యా, టర్కీ, ఖతార్, ఇరాన్‌లను తాలిబన్లు ఆహ్వానించడం గమనార్హం. సోమవారం ఉదయం తాము పంజ్‌షిర్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఇక యుద్ధం ముగియడంతో సుస్థిరమైన ఆఫ్ఘనిస్థాన్ దిశగా అడుగులు వేయనున్నట్లు తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పాడు.
ఇక నుంచి ఎవరు ఆయుధాలు చేత పట్టినా.. వాళ్లు ప్రజలకు, దేశానికి శత్రువులే అని అతడు ప్రకటించాడు. దేశంలోకి చొరబడిన వాళ్లు ఎప్పటికీ దేశాన్ని పునర్నిర్మించలేరని, దేశ ప్రజలే ఆ పని చేయాలని పిలుపునిచ్చాడు. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ఖతార్, టర్కీ, యూఏఈ తమ ఆపరేషన్లు ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు కూడా వెల్లడించాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- afghanistan
- china
- Pakistan
- panjshir
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

