Panjshir | పంజ్‌షిర్‌పై ఎగిరిన తాలిబన్ల జెండా.. నార్తర్న్ అలయెన్స్ చీఫ్ మృతి
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో పంజ్‌షిర్( Panjshir ) ప్రావిన్స్‌ను కూడా తాము గెలిచినట్లు ప్రకటించుకున్నారు తాలిబన్లు.

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో పంజ్‌షిర్( Panjshir ) ప్రావిన్స్‌ను కూడా తాము గెలిచినట్లు ప్రకటించుకున్నారు తాలిబన్లు. ప్రావిన్షియల్ గవర్నర్ కార్యాలయం ముందు తాలిబన్ నేతలు నిల్చున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారి వెనుకే తాలిబన్ జెండా కూడా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ తాలిబన్లను తీవ్రంగా ప్రతిఘటించిన తిరుగుబాటు సేనలు.. మొత్తానికి తలవంచాయి. ఈ యుద్ధంలో నార్తర్న్ అలయెన్స్ కమాండర్ ఇన్ చీఫ్ సలే మహ్మద్‌ను కూడా తాము మట్టుబెట్టినట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. అయితే తాలిబన్లు చెబుతున్నదన్నదంతా అబద్ధమనీ.. పంజ్‌షిర్ ఇంకా తమ ఆధీనంలోనే ఉన్నదని తిరుగుబాటు సేనలు చెబుతుండటం గమనార్హం. పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ కూడా తాలిబన్లకు సహకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పంజ్‌షిర్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. గత నెల 15నే ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోగా.. పంజ్‌షిర్ ప్రావిన్స్ మాత్రమే వారిపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కూడా అక్కడి తిరుగుబాటుదారులతో చేతులు కలిపారు. అయితే తాలిబన్లు పంజ్‌షిర్‌పై దాడి చేసిన తర్వాత అమ్రుల్లా దేశం విడిచి పెట్టి వెళ్లిపోయారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

