కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయినట్లుగా తెలుస్తున్నది. ఆ దేశ నేవీ షిప్‌లోకి సూట్‌కేసులను కొందరు వ్యక్తులు హడావుడిగా తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహులో లోడ్ చేసిన సూట్‌కేసులు రాజపక్సవేనని, ఆయన దేశం విడిచి పారిపోయారని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కాగా, ఎస్ఎల్ఎన్ఎస్ సిందూరాల, గజబాహు యుద్ధ నౌకల్లోకి కొందరు ఎక్కారని, ఆ రెండు షిప్‌లు కొలంబో పోర్ట్‌ను వీడాయని పోర్ట్ హార్బర్ మాస్టర్ తెలిపారు. అయితే ఆయా యుద్ధ నౌకల్లో ఎవరెవరు ఉన్నారన్నది వెల్లడించలేదు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక కూరుకుపోవడంతో ఆ దేశ ప్రజల నిరసనలు తీవ్రమయ్యాయి. శనివారం ఉదయం వేల సంఖ్యలో నిరసనకారులు రాజధాని కొలంబోలోని అధ్యక్షుడు గోటబయ రాజపక్స కార్యాలయం, అధికార నివాసాన్ని ముట్టడించారు. భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి నిలువరించేందుకు ప్రయత్నించినప్పటకీ ఫలితం లేకపోయింది. దీంతో రాజపక్స కార్యాలయం, అధికార నివాసంలోకి నిరసనకారులు చొరబడ్డారు. అధ్యక్షుడి స్విమ్మింగ్ పూల్‌లో కొందరు ఈత కొట్టారు. అలాగే అధ్యక్షుడి కిచెన్‌లోని ఆహారాన్ని మరికొందరు తిన్నారు. అధ్యక్షుడి కార్యాలయం బయట నిరసనకారులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
మరోవైపు అధ్యక్షుడి కార్యాలయం, నివాసం ముట్టడి గురించి ముందుగానే నిఘా సమాచారం అందుకున్న ఆ దేశ ఆర్మీ శుక్రవారం రాత్రే అధ్యక్షుడు గోటబయను ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించింది. శనివారం నిరసకారులు పెద్ద సంఖ్యలో అధ్యక్షుడి కార్యాలయం, నివాసాన్ని ముట్టడించారు. దీంతో కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయానికి గోటబయ కాన్వాయ్‌లోని ఒక వాహనం వచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. అలాగే యుద్ధ నౌకలోకి సూట్‌కేసులను హడావుడిగా తరలిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స, శ్రీలంకను విడిచి పారిపోయి ఉంటారన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత లేనప్పటికీ ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారన్నది కూడా తెలియడం లేదు.
Lmao people actually made the president pack his suitcase and run for his life😂😂
#GoHomeGota #අරගලයටජය #GoHomeRanil pic.twitter.com/gw7Zkr1I5a— ♡ Sanda ♡ (@TachyonJaneesha) July 9, 2022