టోరంటో : వీసా జారీకి ముందే కెనడా చట్టాలపై అవగాహన ఉన్నదని, పూర్తిగా చదివామనే ఒక ‘అంగీకార పత్రం’పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతకాలు చేయడం తప్పనిసరి చేయాలని ఐసీసీసీ అధ్యక్షుడు మురారీలాల్ తప్లియాల్ కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రిని కోరారు. ఈ మేరకు అంగీకార పత్రాన్ని కూడా జత చేయాలని తప్లియాల్ సూచించారు. కెనడా చట్టాలు, నిబంధనలు, ఉల్లంఘనలకు సంబంధించి బుక్లెట్ ఇవ్వాలని అన్నారు.