Earthquake | వనువాటు తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Earthquake : ద్వీపదేశమైన వనువాటు తీరంలో శనివారం భారీ భూకంపం నమోదైంది. దీంతో ఈ భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
Earthquake : ద్వీపదేశమైన వనువాటు తీరంలో శనివారం భారీ భూకంపం నమోదైంది. 6.9, 6.3 తీవ్రతతో రెండు భూకంపాలు నమోదయ్యాయి. దీంతో ఈ భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ భూకంపం వల్ల సంభవించిన నష్టంపై ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. ప్రాణ, ఆస్తి నష్టం గురించిన ఎలాంటి సమాచారం ఇప్పటికి అందుబాటులో లేదు.
పసిఫిక్ తీరంలోనే ఉన్న ఆస్ట్రేలియాకు ఎలాంటి సునామీ ముప్పు లేదని నిపుణులు తెలిపారు. అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) ఈ భూకంపం, సునామీ హెచ్చరికల వివరాల్ని వెల్లడించింది. యూఎస్జీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ సోలా ప్రాంతానికి 200 కిలోమీటర్ల దూరంలో మధ్యాహ్నం 12.31 గంటలకు 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొంతసేపటికి 6.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. వాయువ్య వనువాటు తీరంలోని సముద్ర జలాల్లో 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించింది. దీంతో భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశాలున్నాయని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ (పీటీడబ్ల్యూసీ) హెచ్చరికలు జారీ చేసింది.
వనువాటుపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు, ప్రభుత్వం అందించే సూచనలు, అలర్ట్స్‌ను గమనిస్తూ ఉండాలని ఆదేశించింది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలిచే ప్రాంతంలో వనువాటు ఉంటుంది. ఇది భూంకపాలు, సునామీలు ఎక్కువగా వచ్చే ప్రదేశం. ఇతర పసిఫిక్ దేశాలైన ఫిజి, టోంగాలు కూడా ఈ ప్రదేశంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటికీ సునామీ, భారీ అలలు ఎగసిపడే అవకాశం ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల సంయుక్త తనిఖీలు
Chilling video | మహారాష్ట్రలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Jamia Millia Islamia | ఎన్నికల కోసం జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసన.. భద్రతా సిబ్బందితో ఘర్షణ
రుద్ర వాణి గాయత్రికి ఎంజీయూ డాక్టరేట్
Earthquake | వనువాటు తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

