న్యూఢిల్లీ: ఈ ఫోటోను సరిగా గమనించండి. తెలుపు రంగులో.. వరుసగా ఉన్న ఇవి మెటల్ బాక్సులు. ఆ ఇనుప డబ్బాల్లోనే చైనా కోవిడ్ రోగుల్ని నిర్బంధిస్తోంది. డ్రాగన్ దేశంలో క్వారెంటైన్ రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయో చెప్పడానికి ఈ ఫోటోనే సాక్ష్యం. ఇప్పుడు ఇవే సీన్లు ఆ దేశంలో కనిపిస్తున్నాయి. బిల్డింగ్‌లో ఒక్క పాజిటివ్ కేసు వచ్చినా.. ఇలాంటి క్వారెంటైన్ క్యాంపుల్లోనే అనుమానిత కోవిడ్ పేషెంట్లను బంధిస్తున్నారు. జీరో కోవిడ్ విధానంలో భాగంగా చైనా ఈ చర్యలకు పూనుకుంటోంది. ఇక క్వారెంటైన్ క్యాంపులకు జనాల్ని తరలించేందుకు భారీ సంఖ్యలో బస్సులు క్యూ కడుతున్నాయి. ఆ దేశ సోషల్ మీడియాలో మెటల్ బాక్సుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కోవిడ్ పాజిటివ్ వ్యక్తుల్ని తరలించేందుకు క్యూకట్టిన బస్సుల వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Millions of chinese people are living in covid quarantine camps now!
— Songpinganq (@songpinganq) January 9, 2022
2022/1/9 pic.twitter.com/wO1cekQhps
మెటల్ బాక్సుల్లో ప్రెగ్నెంట్ మహిళలు, చిన్నారులు, వృద్ధులను బంధిస్తున్నారు. ఈ బాక్సులో ఓ వుడెన్ బెడ్‌తో పాటు టాయిలెట్ ఉంటుంది. దాదాపు రెండు వారాల పాటు కోవిడ్ పాజిటివ్ వ్యక్తుల్ని ఈ బాక్సుల్లో నిర్భంధిస్తున్నారు. ఏదైనా ప్రాంతంలో ఒక్క పాజిటివ్ కేసు వచ్చినా.. ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ రాత్రికి రాత్రే క్వారెంటైన్ సెంటర్లకు పంపిస్తున్నారు. ట్రాక్ అండ్ ట్రేస్ యాప్‌లను విరివిగా వాడుతున్నారు. ఆ తక్షణమే వారిని క్వారెంటైన్ చేస్తున్నారు.
Tianjin city
— Songpinganq (@songpinganq) January 11, 2022
Omicron arrived days ago.
People are afraid of lockdown,
So panic buying now.
Please check my old thread.https://t.co/dpkpwcrJQi
2022/1/11 pic.twitter.com/uChbM3tqY2
ప్రస్తుతం రెండు కోట్ల మందిని దేశవ్యాప్తంగా తమ తమ ఇండ్లల్లోనై చైనా అధికారులు నిర్బంధించారు. కనీసం ఆహారం కొనేందుకు కూడా వాళ్లను బయటకు పంపడం లేదు. చైనాలో 2019లో తొలిసారి కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. డైనమిక్ జీరో విధానంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు కఠిన లాక్డౌన్లు, మాస్ టెస్టింగ్‌లను నిర్వహిస్తున్నారు.