ట్రంప్‌నకు కోటి చెల్లించండి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వేసిన పరువు నష్టం కేసులో అమెరికా శృంగార తార స్టార్మీ డేనియల్స్‌కు చుక్కెదురైంది. ఆరోపణలు రుజువు చేయడంలో విఫలమైనందుకు ట్రంప్ న్యాయవాదులకు సుమారు ఒక కోటి రూపాయలు చెల్లించాలని 9వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ మంగళవారం ఆదేశించింది.
- శృంగార తార డేనియల్స్‌కు కోర్టు ఆదేశం
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వేసిన పరువు నష్టం కేసులో అమెరికా శృంగార తార స్టార్మీ డేనియల్స్‌కు చుక్కెదురైంది. ఆరోపణలు రుజువు చేయడంలో విఫలమైనందుకు ట్రంప్ న్యాయవాదులకు సుమారు ఒక కోటి రూపాయలు చెల్లించాలని 9వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ మంగళవారం ఆదేశించింది. మరోవైపు తనపై దాఖలైన 34 నేరాభియోగాల్లో తాను దోషిని కాదని ట్రంప్ కోర్టుకు తెలిపారు. డేనియల్స్‌తో సంబంధం బయటపడకుండా ఉండేందుకు ఆమెతో అనైతిక ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణల కేసులో ట్రంప్ మంగళవారం మన్హటన్ కోర్టు విచారణకు హాజరయ్యారు. అంతకుముందు, లొంగిపోయేందుకు ట్రంప్ కోర్టు హాలుకు రాగా, పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. విచారణ అనంతరం ట్రంప్ కోర్టు నుంచి వెళ్లిపోయారు.
బైడెన్ వల్ల మూడో ప్రపంచ యుద్ధం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కారణంగా మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ అన్నారు. అణ్వాయుధాల వినియోగంపై ప్రపంచ దేశాలు బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్నాయని, తాను అధికారంలో ఉన్నప్పుడు ఇలా జరగలేదని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

