సబ్బు బుడగ ఏంటి ఇంత అద్భుతంగా ఉంది. అనుకుంటున్నారా? అయితే, మీరు పొరపడినట్లే. విశ్వ సౌందర్యాన్నంతా నింపుకున్న ఈ ఖగోళ అద్భుతం మన పాలపుంతలోనిదే. హబుల్ టెలిస్కోప్ 2016లో ఈ ఫొటో తీసింది. కొన్ని రోజులుగా పనిచేయని ఆ టెలిస్కోప్.. మళ్లీ తన కెమెరాకు పని పెట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నాసా ఈ చిత్రరాజాన్ని షేర్ చేసింది. బబుల్లో ఉన్న నక్షత్రం సూర్యుడి కంటే 10 లక్షల రెట్లు ఎక్కువ ప్రకాశవంతమైందట.