టొరంటో, డిసెంబర్ 3: ఓపెన్ వర్క్ పర్మిట్ (ఓడబ్ల్యూపీ) హోల్డర్లకు కెనడా శుభవార్త చెప్పింది. దేశంలో నెలకొన్న లేబర్ కొరత నేపథ్యంలో వర్క్ పర్మిట్‌ను విస్తరిస్తూ ఓడబ్ల్యూపీ హోల్డర్ల కుటుంబసభ్యులు కూడా ఉద్యోగాలు చేసుకొనేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కెనడా మంత్రి సేన్ ఫ్రేజర్ ప్రకటన చేశారు.
2023 ప్రారంభం నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. దేశంలో నెలకొన్న లేబర్ కొరత సమస్యను పరిష్కరించడంలో తాజా నిర్ణయం సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ నిర్ణయం ద్వారా కెనడాలో గణనీయంగా ఉండే వేల మంది భారతీయులకు లబ్ధి చేకూరనున్నది. కెనడాలో ఏ ఉద్యోగం అయినా చేసుకొనేందుకు ఈ ఓపెన్ వర్క్ పర్మిట్ విదేశీయులను అనుమతిస్తుంది.