Militar Spy Satellite | తొలి సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించిన దక్షిణ కొరియా
అణ్వాయుధ దేశమైన ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దక్షిణ కొరియా అప్రమత్తమవుతున్నది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా కిమ్ కిగ్డమ్ చర్యలపై ఓ కన్నేసి ఉంచేందుకు సైనిక గూఢచార ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపించింది.
సియోల్: అణ్వాయుధ దేశమైన ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దక్షిణ కొరియా (South Korea) అప్రమత్తమవుతున్నది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా కిమ్ కిగ్డమ్ (North Korea) చర్యలపై ఓ కన్నేసి ఉంచేందుకు సైనిక గూఢచార ఉపగ్రహాన్ని (Militar Spy Satellite) రోదసీలోకి పంపించింది.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నిఘా ఉపగ్రహాన్ని కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్లో ఉన్న యూఎస్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ (SpaceX) ఫాల్కన్ 9 రాకెట్లలో ఒకటి నింగిలోకి ప్రవేశపెట్టింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10.19 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే ఈ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టామని దక్షిణ కొరియా రక్షణ శాఖ ప్రకటించింది. 11.37 గంటలకు ఉపగ్రహం నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ కూడా అందాయని తెలిపింది. దీంతో ఉత్తర కొరియాపై కన్నేసి ఉంచేందుకు రూపొందించిన తొలి సైనిక నిఘా ఉపగ్రహాన్ని దక్షిణ కొరియా పంపినట్లయింది.
కాగా, గత వారం ఉత్తర కొరియా కూడా సైనిక గూఢచార ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపించిన విషయం తెలిసిందే. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన గూఢచార ఉపగ్రహాన్ని ప్యాంగాంగ్ గత నెల 28న ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణ కొరియా కూడా సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించడం విశేషం. 2025 నాటికి మరో నాలుగు గూఢచార ఉపగ్రహాలను పంపించడానికి దక్షిణ కొరియా లక్ష్యంగా పెట్టుకున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

