Mobile Phone addiction | టోక్యో : ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలు మందబుద్ధికి గురయ్యే ప్రమాదం ఉన్నట్టు జపాన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. పిల్లలు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్డీ) బారిన పడే ప్రమాదం అధికంగా ఉన్నట్టు తేలింది.
బాల్యంలో ఎక్కువ సమయం ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల ఏఎస్డీతోపాటు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్డీ)కు పిల్లలు గురవుతారని పరిశోధకులు గుర్తించారు.