Felix Baumgartner: 2012లో స్ట్రాటోస్పియర్ నుంచి దూకాడు.. ఇప్పుడు పారాగ్లైడింగ్ చేస్తూ స్కైడైవర్ మృతి
Felix Baumgartner: స్కైడైవర్ ఫెలిక్స్ బామ్గార్ట్నర్ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. 56 ఏళ్ల ఉన్న అతను పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. 2012లో స్ట్రాటోస్పియర్ నుంచి దూకి అతను ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.
లండన్: ప్రఖ్యాత డేర్‌డెవిల్ స్టంట్ క్రియేటర్, ఆస్ట్రియ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్గార్ట్నర్(Felix Baumgartner) అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. 56 ఏళ్ల ఉన్న అతను పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. 2012లో స్ట్రాటోస్పియర్ నుంచి దూకిన అతను ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయితే తాజాగా ఇటలీ తీరంలో పారాగ్లైడింగ్ చేస్తూ చనిపోయినట్లు తెలుస్తోంది. ఏ కారణం చేత అతను ప్రాణాలు కోల్పోయాడో ఇంకా స్పష్టంగా తెలియదు. అడ్రియాటిక్ కోస్టు తీరంలో అతను ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. కంట్రోల్ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోర్టో సాంట్ ఎల్పిడోలో ఉన్న ఓ హాలీడే రెసిడెన్స్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో అతను కూలి పడినట్లు తెలుస్తోంది. ఆ ప్రమాదంలో ఓ మహిళకు గాయం కూడా అయ్యింది.
స్కైడైవర్ ఫెలిక్స్ బామ్ గార్ట్నర్ జంపింగ్‌లో స్పెషలిస్టు. ఓ క్యాప్సూల్ నుంచి 2012లో అతను స్ట్రాటోస్పియర్ నుంచి కిందకు దూకాడు. భూమికి సుమారు 39 కిలోమీటర్ల ఎత్తు నుంచి అతను డైవ్ చేశాడు. ఆ స్టంట్తో అతను వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.
“sometimes…
you have to get up really high…
to understand how small your are.
I’m ~ coming ~ home ~ now”
— Felix Baumgartner pic.twitter.com/L8IMqb9reQ
— World of Engineering (@engineers_feed) July 17, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

