Singapore: డ్రగ్స్ కేసుతో లింకున్న మహిళను ఉరితీసిన సింగపూర్
Singapore Executetion : దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత సింగపూర్‌లో మహిళను ఉరితీశారు. 30 కేజీల హెరాయిన్ సరఫరా చేస్తున్న కేసులో ఆమెను 2018లో పట్టుకున్నారు. ఇవాళ ఉదయం ఆమెను చాంగీ జీ జైలులో ఉరితీశారు.
సింగపూర్: మాదకద్రవ్యాల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న 45 ఏళ్ల సారిదేవి జమానిని ఇవాళ సింగపూర్(Singapore)లో ఉరి తీశారు(Executed). దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆ దేశంలో ఓ మహిళను ఉరితీయడం ఇదే మొదటిసారి. 2018లో సుమారు 30 కేజీల హెరాయిన్‌ను సరఫరా చేస్తూ ఆమె పట్టుబడింది. గత వారం రోజుల్లో మరణ దండన ఎదుర్కొన్న రెండవ డ్రగ్ నేరస్థురాలు ఆమె. సింగపూర్‌లో డ్రగ్స్ నివారణ కోసం కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నారు. దాదాపు 15 కేజీల హెరాయిన్ దొరికితే, అలాంటి నిందితులకు సింగపూర్‌లో మరణశిక్ష అమలు చేస్తారు.
2018 జూలై ఆరవ తేదీన సారిదేవికి మరణశిక్ష విధించినట్లు సింగపూర్‌కు చెందిన సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో పేర్కొన్నది. అయితే చట్ట ప్రకారమే ఆమెను ఉరితీసినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఆమె పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను కొట్టిపారేశారు. రెండు రోజుల క్రితం అజిజ్ అనే వ్యక్తిని కూడా ఉరితీశారు. 2017లో 50 కేజీల హెరాయిన్‌తో అతను పట్టుబడ్డాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

