ముందు లాక్డౌన్ పెట్టి.. చైనాలాగా హాస్పిటల్స్ కట్టండి: ఫౌచీ సూచన

వాషింగ్టన్: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కట్టడికి ముఖ్యమైన సూచనలు చేశారు అమెరికా వైద్య నిపుణుడు, వైట్‌హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ. ముందు దేశంలో కనీసం రెండు వారాలు లాక్డౌన్ పెట్టండి. ఆ తర్వాత చైనాలోలాగా తాత్కాలిక హాస్పిటల్స్‌ను నిర్మించండి. ఓ కేంద్ర వ్యవస్థను ఏర్పాటు చేయండి అని ఫౌచీ సూచించారు. సూచనలే కాదు కరోనాపై గెలిచేశామంటూ భారత ప్రభుత్వం చాలా ముందుగానే ప్రకటించిందని చురకలంటించారు.
ఇండియా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత ఎక్కువ కాలం దేశంలో లాక్డౌన్ విధించండి. ఇది చాలా ముఖ్యం. ఆ తర్వాత అత్యవసరాలైన ఆక్సిజన్, ఇతర మందులు, పీపీఈ కిట్లు సమకూర్చుకోండి అని ఫౌచీ సూచించారు. దీనికి చైనా ఉదాహరణను ఆయన చెప్పారు. గతేడాది అక్కడ ఇలాగే కరోనా విరుచుకుపడినప్పుడు దేశం మొత్తం లాక్డౌన్ విధించారు. వైరస్ సంక్రమణను అడ్డుకోవడానికి ఇది చాలా అవసరం. తర్వాత వ్యాక్సినేషన్ వేగం పెంచండి. అత్యవసరాలన సమకూర్చుకోవడంపై దృష్టి సారించండి. గతంలో ఇండియా సాయం చేసింది కాబట్టి ఇప్పుడు అమెరికాతోపాటు చాలా దేశాలు సాయానికి ముందుకు వచ్చాయి అని ఫౌచీ అన్నారు.
ఇక రెండోది చైనాలాగే అత్యంత వేగంగా తాత్కాలిక హాస్పిటల్స్‌ను ఇండియా నిర్మించాలి. ఈ విషయంలో చైనాను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఇండియాలో హాస్పిటల్స్ చాలా అవసరం. మిలిటరీ సాయం తీసుకోవడంపైనా ప్రభుత్వం దృష్టి సారించాలి. అమెరికాలో వ్యాక్సిన్ల పంపిణీకి నేషనల్ గార్డ్ సాయం తీసుకున్నాం. ఇక హాస్పిటల్స్‌ను యుద్ధం సమయంలో ఎలా నిర్మిస్తారో అంత వేగంగా నిర్మించాలి. ఇక్కడ మన శత్రువు వైరస్ అని ఫౌచీ అన్నారు. ఇండియాలో ఇప్పటి వరకు కేవలం 2 శాతం మందికే వ్యాక్సిన్ ఇవ్వడం చాలా తీవ్రమైన అంశమని, ఏం చేసైనా వ్యాక్సినేషన్ వేగం పెంచాల్సిందే అని ఫౌచీ స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
AP News | పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కాంగ్రెస్-టీడీపీ బాహాబాహీ..!
Brain Fog | రాత్రి సరిగ్గా నిద్రించినా ఉదయం తల భారంగా ఉంటుందా.. అందుకు కారణాలు ఇవే..
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

